నిర్మల్ జిల్లాలో నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలి : టీయూడబ్ల్యుజే

 నిర్మల్ జిల్లాలో నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలి : టీయూడబ్ల్యుజే

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో చలామణీ అవుతున్న నకిలీ విలేకరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం టీయూడబ్ల్యుజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ఎస్పీ జానకీ షర్మిలను కోరారు. వినతిపత్రం అందించి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య మాట్లాడారు. జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా సోషల్ మీడియా, వెబ్​సైట్ల పేరిట తప్పుడు వార్తలు ప్రచురిస్తూ, బ్లాక్ మెయిల్​కు పాల్పడుతున్న నకిలీ విలేకరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

స్పందించిన ఎస్పీ త్వరలోనే నకిలీ విలేకర్లను గుర్తించి వారిపై కేసులను నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో డీపీఆర్​వో విష్ణుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్ముల అశోక్, కోశాధికారి వకులాభరణం ప్రశాంత్, సోషల్ మీడియా కన్వీనర్ యోగేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.