20 లక్షల కోట్ల మెగా ప్యాకేజీ వివరాలు ప్రకటించనున్న నిర్మలా సీతారామన్

20 లక్షల కోట్ల మెగా ప్యాకేజీ వివరాలు ప్రకటించనున్న నిర్మలా సీతారామన్
  • సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల మెగా ఫైనాన్షియల్ ప్యాకేజీ వివరాలను సాయంత్రం 4 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. మంగళవారం ప్రధాని మోడీ ప్రకటించిన ప్యాకేజీ ఏ విధంగా ఉంటుందోనన్నది ఆసక్తిగా మారింది. దేశ జీడీపీ లో ఏకంగా 10 శాతాన్ని మోడీ ఫైనాన్షియల్ ప్యాకేజీగా ఇస్తున్నట్లు తెలిపారు. ప్యాకేజీ సమగ్ర రూపాన్ని ఆర్థిక మంత్రి వివరిస్తారని ఆయన చెప్పిన మరుసటి రోజే నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు రానున్నారు. దీంతో ప్రతి ఒక్కరిలో ఏయే వర్గాలను ప్రయోజనం కల్పిస్తారోనని అందరిలో ఆసక్తి నెలకొంది. దాదాపు 50 రోజులకు పైగా లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. స్మాల్ అండ్ మీడియం వ్యాపార సంస్థలు దిక్కుతోచని పరిస్థితికి చేరుకున్నాయి. కార్పొరేట్ కంపెనీలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. రైతులు, మైగ్రెంట్ లేబర్స్, ఎంప్లాయిస్ ఇలా అన్ని రంగాలు ఎఫెక్ట్ అయ్యాయి. దీంతో కేంద్రం సాయం కోసం ప్రతి ఒక్కరూ ఆశగా చూస్తున్నారు. ప్రధాని మోడీ ప్రకటించిన ప్యాకేజ్ లో రైతులు, మైగ్రెంట్ లేబర్స్, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ తో పాటు కీలకమైన రంగాలన్నింటికీ ప్రోత్సాహాకాలు, రాయితీ అందించవచ్చని ఆశిస్తున్నారు. ప్రజలకు రుణాల కోసం బ్యాంకులకు కూడా ఆర్థిక సహాయం ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి మొత్తం రూట్ మ్యాప్ ను కేంద్రం సిద్ధం చేసింది. లాక్ డౌన్ 4.0 ఉంటుందని ప్రధాని మోడీ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో అన్ని రంగాలకు మేలు జరిగేలా ఎలాంటి చర్యలు ప్రకటిస్తారో వేచి చూడాలి.