
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి 2021 - 22 ఆర్థిక సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టారు. 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 8 - 8.5 ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రస్తుత సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతంగా ఉండొచ్చని చెప్పింది. వ్యవసాయ రంగంపై కొవిడ్ మహమ్మారి ప్రభావం తక్కువగానే ఉందని, 2021 –22లో వ్యవసాయ రంగం 3.9శాతం వృద్ధి నమోదుచేస్తుందని చెప్పారు. పారిశ్రామిక రంగం 11.8శాతం, సేవల రంగం 8.2శాతం వృద్ధి నమోదుచేస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
2021–22లో భారత ఎగుమతులు 16.5శాతం పెరుగుతాయని, దిగుమతులు 29.4శాతంగా ఉంటాయని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది. భారత్ సహా అభివృద్ధి దేశాలు క్లైమేట్ ఫైనాన్స్ కీలకమని సర్వే పేర్కొంది. అమెరికా, చైనా తర్వాత భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థను కలిగి ఉందని చెప్పింది. డిసెంబర్ 2021లోనే దేశంలో రూ. 8.26లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.
మరిన్ని వార్తల కోసం..