
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఐదోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అత్యంత చిన్నది. ఈసారి కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలమ్మ కేవలం 86 నిమిషాల్లోనే ముగించారు. 2020–21 బడ్జెట్ సందర్భంగా నిర్మల ఏకధాటిగా 162 నిమిషాలు ప్రసంగించారు. దీంతో భారతదేశ చరిత్రలోనే ఆర్థిక మంత్రుల బడ్జెట్ ప్రసంగాల రికార్డులను ఆమె తిరగరాశారు. అనాడు ఒంట్లో నలతగా ఉందని మరో 2 పేజీలు ఉండాగానే నిర్మల తన ప్రసంగాన్ని ముగించారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి ఇదే పూర్తిస్థాయి చివరి బడ్జెట్.