నోవీ సాద్ (సెర్బియా): అండర్–23 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా రెజ్లర్లు మెరిశారు. వివిధ కేటగిరీల్లో నిషు, పుల్కిట్, శ్రీష్టి సెమీస్‌లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన 55 కేజీ క్వార్టర్‌ఫైనల్లో నిషు 10–1తో కైరా సోలోబుచుక్ (సెర్బియా)పై గెలిచింది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో ఇండియా రెజ్లర్.. మోయి కియుకా (జపాన్)ను ఓడించింది. 6–2 ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థిని పిన్‌డౌన్ చేసి ఏకపక్ష విజయం సాధించింది.
65 కేజీల్లో పుల్కిట్ టెక్నికల్ సుపిరియారిటీతో ఆకట్టుకుంది. వరుసగా 10–0తో మరియా సావియాక్ (కెనడా)పై, 18–8తో బెయెజా అక్కుస్ (టర్కీ)పై నెగ్గింది. 68 కేజీల విభాగంలో శ్రీష్టి 12–2తో అంజెలినా ఎల్లిస్ టోడింగ్టోన్‌పై, 6–3తో మనోలా స్కోబ్లెస్కా (జార్జియా)పై గెలిచింది. 57 కేజీ తొలి రౌండ్‌లో 6–0తో జార్జియనా లిర్కా (రొమేనియా)పై గెలిచిన నేహా శర్మ క్వార్టర్స్‌లో అకారీ ఫుజినామా (జపాన్) చేతిలో టెక్నికల్ సుపిరియారిటీతో ఓడింది.
