నితిన్, వెంకీ కుడుముల మూవీ.. క్రేజీ అనౌన్స్‌‌మెంట్‌‌

నితిన్, వెంకీ కుడుముల మూవీ..   క్రేజీ అనౌన్స్‌‌మెంట్‌‌

బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు నితిన్. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఒకటి. ఈ మూవీకి సంబంధించి క్రేజీ అనౌన్స్‌‌మెంట్‌‌ను మంగళవారం ప్రకటించారు మేకర్స్. ‘అన్ మాస్కింగ్ ద కాన్ మాన్’ అంటూ జనవరి 26 న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ‘గిఫ్టింగ్ సీజన్ ముగుస్తుంది.. లూటింగ్ సీజన్ బిగిన్స్’ అని ఎత్తైన బిల్డింగ్‌‌పై  శాంటా క్లాజా గెటప్‌‌లో వెనుక నుంచి కనిపిస్తున్న పోస్టర్‌‌‌‌తో క్యూరియాసిటీని పెంచారు.

 అలాగే ‘అడ్వెంచరస్ ఎంటర్‌‌‌‌టైనర్ మీ ముందుకు రాబోతోంది’ అని పోస్టర్‌‌‌‌పై రాసుండటం సినిమాపై ఆసక్తిని పెంచింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ‘భీష్మ’ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌‌లో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతోఅంచనాలు ఏర్పడ్డాయి.