సినీ హీరో నితిన్ దంపతులు ఇవాళ నవంబర్ 13న శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు . దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో నితిన్ దంపతులు కార్తిక దీపారాధన నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించి ఆశీర్వచనం అందించారు.
నితిన్ సినిమాలు ఈ మధ్య ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. లాస్ట్ మూవీ తమ్ముడు కూడా సరిగా ఆడలేదు. నితిన్ ప్రస్తుతం మంచి హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. వేణు డైరెక్షన్ లో ఎల్లమ్మ సినిమా చేస్తాడని ప్రచారం జరిగినా అది వేరే వాళ్ల చేతిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం నితిన్ కొత్త సినిమా ఏది అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కానీ రెండు సినిమాలు చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి ఇష్క్ మూవీ డైరెక్టర్ విక్రమ్ కె .కుమార్ తో మళ్లీ సినిమా చేస్తాడని టాక్ వినిపిస్తోంది. మరో డైరెక్టర్ శ్రీను వైట్లతో నితిన్ సినిమా కూడా ఉందని సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏది నిజమో కొన్ని రోజులు వెయిట్ చెయ్యాలి
