టాలీవుడ్ యువ హీరో నితిన్ పెళ్లి సందడి షురూ అయింది. బుధవారం హైదరాబాద్‌లో నితిన్ – షాలినిల కుటుంబ పెద్దలు తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ నెల 26న రాత్రి 8:30 నిమిషాలకు ఫలక్ నుమా ప్యాలస్ లో నితిన్- షాలిని వివాహం జరగనుంది. ఇప్పటికే తన పెళ్లికి వచ్చి ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ నితిన్.. సీఎం కేసీఆర్‌కు స్వయంగా ఆహ్వానం అందజేశారు. అలాగే సినీ ఇండస్ట్రీలో తన అభిమాన హీరోగా చెప్పుకునే పవన్ కళ్యాణ్‌తోపాటు సినీ ఇండస్ట్రీ పెద్దలను పెళ్లికి విచ్చేయాల్సిందిగా నితిన్ ఆహ్వానించారు.
