ముచ్చటగా మూడు సినిమాలతో బిజీబిజీగా నితిన్

ముచ్చటగా మూడు సినిమాలతో బిజీబిజీగా నితిన్

విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నాడు నితిన్. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆయన అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమింగ్ మూవీస్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు ఆయా మూవీ మేకర్స్.  సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తన నెక్స్ట్ సినిమా ఉండనుందని అనౌన్స్ చేశారు.

నితిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డే విషెస్ తెలియజేస్తూ తమ  సంస్థలో  ప్రొడక్షన్ నెంబర్ 43గా ఈ చిత్రం  రూపొందనుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించారు. ఈ చిత్రానికి  డైరెక్టర్ ఎవరనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ‘ఆయ్’ చిత్రంతో సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకున్న అంజి కె మణిపుత్ర తెరకెక్కించనున్న చిత్రంలో నితిన్ హీరోగా నటించబోతున్నట్టు అనౌన్స్ చేశారు.

రుచిర ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 10గా ఈ సినిమాను నితిన్ అక్క నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. అలాగే  నితిన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రెండు నెలల క్రితం  ఓ చిత్రాన్ని ప్రకటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పవన్ కుమార్ సమర్పణలో  శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నితిన్ హీరోగా నటిస్తున్న 36వ చిత్రమిది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది రూపొందుతోందని తెలియజేస్తూ ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి ఈ మూడింటిలో ఏది ముందుగా రెగ్యులర్ షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లనుందో చూడాలి!