నితిన్ మాచర్ల నియోజకవర్గం ట్రైలర్.. డైరెక్ట్ యాక్షనే

నితిన్ మాచర్ల నియోజకవర్గం ట్రైలర్.. డైరెక్ట్ యాక్షనే

నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కామోడీ, పొలిటిక్ యాక్షన్ థ్రిల్లర్ తో  ట్రైలర్ ను కట్ చేసినట్లు కనిపిస్తోంది.  ట్రైలర్ లో   ‘నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ లా పంచ్ లు, వీళ్లేమో బోయపాటి యాక్షన్ సీన్ లు.. ఇపుడు నేనేం చేయాలి. రాజమౌళి సినిమా హీరోలాగా ఎలివేషన్ ఇవ్వాలా’ . కలెక్టర్ మీద చెయ్యేస్తే గవర్నమెంట్ మీద చెయ్యి వేసినట్టే అని  నితిన్ చెప్పే డైలాగ్ లు పవర్ ఫుల్ గా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే రాజప్ప అనే విలన్‌ తో హీరో నితిన్  తన పవర్‌తో ఎలా ఢీకొడతాడనేది ఈ సినిమా స్టోరీగా కనిపిస్తోంది. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్ గా  నటిస్తోంది. సముద్రఖని విలన్ గా.. రాజేంద్రప్రసాద్,ఇంద్రజ,మురళిశర్మ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్ట్ 12 ఈ మూవీ థియేటర్లో రిలీజ్ కానుంది.  నితిన్  హోం బ్యానర్ శ్రేష్ట్ మూవీస్  ఈ సినిమాను నిర్మిస్తోంది.