Nithin New Project : హీరో నితిన్ కొత్త సినిమా షురూ

Nithin New Project : హీరో నితిన్ కొత్త సినిమా షురూ

హీరో నితిన్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అప్పట్లో భారీ హిట్ అందుకున్న భీష్మ కాంబోను రిపీట్ చేస్తూ, దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్ నటించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్నగా నటించనుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోగా. . నితిన్ రష్మికలపై మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టడం విశేషం. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను హీరో నితిన్ తో పాటు ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.- ఇక ఈ పూజా కార్యక్రమంలో డైరెక్టర్స్ బాబీ, గోపిచంద్ మలినేని, హను రాఘవపూడి, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని  సమకూరుస్తున్న ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే 2020లో భీష్మ సినిమా తర్వాత నితిన్ ను అంత పెద్ద మళ్లీ రాలేదు. ఆ తర్వాత మళ్లీ అదే కాంబో ఈ సారి రిపీట్ కానుండడమే దానికి ముఖ్య కారణం.

https://www.instagram.com/p/CqKeF4BLfQ2/?utm_source=ig_web_copy_link