
ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ సినిమాల రీమిక్స్ సాంగ్స్‌తో తన అభిమానాన్ని చాటుకున్న నితిన్.. ఈసారి ఏకంగా పవన్ మూవీ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘తమ్ముడు’ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. శనివారం నితిన్ బర్త్ డే సందర్భంగా టైటిల్‌ను రివీల్ చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘చేతిలో శూలంతో ఓ బస్సుపై కూర్చుని ఉన్నాడు నితిన్. బస్సును ఓ మహిళ డ్రైవ్ చేస్తుండగా, లోపల నటి లయ కనిపిస్తోంది. మొత్తంగా రొటీన్‌కు భిన్నంగా వేణు శ్రీరామ్ ఈ సినిమా తీస్తున్నట్టు అర్థమవుతోంది. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.
‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దిల్, శ్రీనివాస కళ్యాణం చిత్రాల తర్వాత దిల్ రాజు నిర్మాతగా నితిన్ నటిస్తున్న మూడో చిత్రమిది. అలాగే ఈ బ్యానర్‌లో ఎంసీఏ, వకీల్ సాబ్ తర్వాత వేణుశ్రీరామ్ తీస్తున్న మూడో చిత్రం కూడా. ఇదిలా ఉంటే నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘రాబిన్‌హుడ్’ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఏజెంట్‌లుక్‌లో స్టైలిష్‌గా కనిపించాడు నితిన్. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.