కల్తీ మద్యం ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం నితీష్ కుమార్

కల్తీ మద్యం ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం నితీష్ కుమార్

బిహార్ లో జరిగిన కల్తీ లిక్కర్ ఘటనపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఈ విషయంపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ మరోమారు మండిపడ్డారు. లిక్కర్ తాగే వారు చనిపోవడం సాధారణమైన విషయమేనన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న ఆయన..  తాము రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నిషేధంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. బాపు(మహాత్మా గాంధీ) ఏం చెప్పారో మీకు తెలుసన్న నితీష్... ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఏం చెబుతున్నాయి? అని ప్రశ్నించారు. మద్యం ప్రమాదకరమని ఇంటింటికి తెలియజేస్తున్నామని, చాలా కాలంగా కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారని తెలిపారు. 

ఇప్పటికే ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకున్నామని, అయితే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నితీష్ కుమార్ సూచించారు. నిషేధం ఉన్నా కూడా కొందరు విక్రయిస్తున్నారంటే అందులో తప్పుందని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా బిహార్ లోని సరన్​ జిల్లాలోని చాప్రా2 గ్రామాల్లో కల్తీ లిక్కర్ తాగిన చనిపోయిన వారి సంఖ్య 39కి చేరింది. వీరిలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.