సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాం: నితీష్ కుమార్

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాం: నితీష్ కుమార్

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సొంతగడ్డ అయిన గుజరాత్‌లో బీజేపీ భారీ విజయాన్ని సాధిస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, హిమాచల్ లో కాంగ్రెస్‌పై ఆ పార్టీ స్వల్ప ఆధిక్యతను కనబరిచి విజయం సాధిస్తుందని వెల్లడించాయి.

ఎగ్జిట్ పోల్స్ పై మాట్లాడిన నితీష్ .. తుది ఫలితాలు ప్రకటించే వరకు అందరం  వేచిచూద్దామని అన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలతో కలిసి బీజేపీని ఓడిస్తానని ఆయన శపథం చేశారు.  పాట్నా హైకోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జేడీయూ అధినేత నితీష్ కుమార్ నివాళులు అర్పించారు.