కాన్‌బెరా: టీమిండియా ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మరోసారి గాయపడ్డాడు. మెడ నొప్పి కారణంగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా కంగారూ టీమ్‌తో మూడో వన్డేకు దూరంగా ఉన్నాడు. ఆ గాయం నుంచి కోలుకుంటున్న దశలో టీ20 సిరీస్ ముంగిట మెడ కండరాల్లో ఇబ్బంది రావడంతో బుధవారం జరిగిన తొలి టీ20కి అందుబాటులోకి లేకుండా పోయాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడిని పర్యవేక్షిస్తోందని బోర్డు తెలిపింది.
