
హైదరాబాద్: నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థుల ఆందోళనలు 14వ రోజు కూడా కొనసాగుతున్నాయి. హాస్టల్ బిల్డింగ్ ను పూర్తిగా యూజీ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే కొత్తగా కట్టిన హాస్టల్ బిల్డింగ్ ను 50 శాతం పీజీ, 50 శాతం డిగ్రీ విద్యార్థులకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ నిర్ణయాన్ని విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళనలు మొదలుపెట్టారు. మరోవైపు నిజాం కాలేజీ విద్యార్థులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇవాళ ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజాం కాలేజీకి వెళ్లనున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.