
నిజాం కాలేజ్ లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. యూజీ విద్యార్థులకు హాస్టల్ కేటాయించాలని కాలేజీలో శాంతియుత నిరసనలు తెలుపుతున్నారు. కొత్తగా కట్టిన హాస్టల్ బిల్డింగ్ ను యూజీ విద్యార్థులకు కాకుండా పీజీ స్టూడెంట్స్ కు ఇవ్వడంపై కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
డిగ్రీ స్టూడెంట్స్ కు కొత్త హాస్టల్ బిల్డింగ్ ఇస్తామని మొదట మాట ఇచ్చారని, ఇప్పుడేమో పీజీ వాళ్లకు ఇచ్చారని అంటున్నారు. తమకు హాస్టల్ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని అంటున్నారు. అయితే ముందు జాగ్రత్తగా నిజాం కాలేజీలో పోలీసులు మోహరించారు. మొన్న స్టూడెంట్స్ ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.