వీడిన కిడ్నాప్ మిస్టరీ: తల్లిదండ్రుల చెంతకు నిజామాబాద్‌ చిన్నారి

వీడిన కిడ్నాప్ మిస్టరీ: తల్లిదండ్రుల చెంతకు నిజామాబాద్‌ చిన్నారి

నిజామాబాద్ పాప కిడ్నాప్ మిస్టరీ వీడింది. రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఆశియా హని ఆచూకి దొరికింది. మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా నర్సీలో పాపను వదలివెళ్లారు కిడ్నాపర్స్. చిన్నారిని నిజామాబాద్ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. పాప క్షేమంగా రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

షాపింగ్ కోసం 8వ తేదీన మెట్ పల్లి నుంచి నిజామాబాద్ కు వచ్చింది కుటుంబం. బిల్లు చెల్లిస్తుండగా మూడేళ్ల ఆశియా హని కిడ్నాపైంది. షాపింగ్ మాల్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా దొరక్కపోవడంతో కూతురు కిడ్నాప్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. చిన్నారిని కొందరు మహిళలు తీసుకెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. నిజామాబాద్ లోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. చివరకు మహారాష్ట్రలో చిన్నారిని ఆచూకీ కనుగొన్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన సమాచారంతో.. మహారాష్ట్రకు వెళ్లి పాపను తీసుకొచ్చారు పోలీసులు. పాపను క్షేమంగా తీసుకొచ్చి.. పేరెంట్స్ కు అప్పగించారు.