- ఆర్మూర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
- 580 గ్రాముల గోల్డ్, రూ.19.33 లక్షల క్యాష్ రికవరీ
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో వ్యాపారి రాజ్కుమార్అగర్వాల్ఇంట్లో మే 24న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. రాజ్‌కుమార్ సొంత అన్న కొడుకు రౌడీషీటర్అయిన విజయ్అగర్వాల్సారథ్యంలోనే చోరీ జరిగినట్లు దర్యాప్తులో తేలిందని సీపీ సాయిచైతన్య తెలిపారు. వివరాలను నిజామాబాద్‌లోని పోలీస్కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఆర్మూర్మహాలక్ష్మి కాలనీకి చెందిన రాజ్కుమార్అగర్వాల్గతంలో బంగారం బిజినెస్ చేసి ప్రస్తుతం బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. పలు నేరాలు చేసిన రాజ్‌కుమార్ అన్న కొడుకు విజయ్ అగర్వాల్‌పై పోలీసులు ఇప్పటికే రౌడీ షీట్ ఓపెన్ చేశారు. బాబాయ్ ఇంట్లో నగదు, బంగారం ఉందని తెలిసిన విజయ్వాటిని కాజేసేందుకు దొంగతనం ప్లాన్వేశాడు.
బాబాయ్ ఇంటి తాళంచెవిని డుప్లికేట్ చేయించాడు. మే 24న రాజ్కుమార్తన కుటుంబంతో కలిసి వేములవాడ దైవదర్శనానికి వెళుతున్నట్లు తెలుసుకొని చోరీ కోసం హైదరాబాద్ నందినగర్‌లో ఉండే సల్మాన్ ఖాన్‌ను సంప్రదించాడు. సల్మాన్‌ఖాన్, మంజల్ సాయికుమార్, శ్రీహరి ఆర్మూర్‌కు చేరుకొని 24న రాత్రి ఇంట్లోకి చొరబడి బీరువాలోని 580 గ్రాముల బంగారం, 10 గ్రాముల చైన్, 350 గ్రాముల వెండి ఆభరణాలతోపాటు రూ.22.93 లక్షల నగదులో ఉడాయించారు.
ఘటనపై బాధిత కుటుంబం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. బ్రహ్మణపల్లి చౌరస్తాలో ముగ్గురు వ్యక్తులు ఒక బ్యాగ్‌తో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
దొంగతనం చేసిన బంగారం, వెండిని మొత్తం రికవరీ చేసుకోగా.. రూ.22.93 లక్షల నగదులో రూ.19.33 లక్షల సొమ్మును వారి నుంచి స్వాధీనం చేసుకున్నరు. విజయ్‌తోపాటు సల్మాన్‌ఖాన్, సాయికుమార్‌ను అరెస్ట్ చేశామని, శ్రీహరి పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు.
