ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
  • 5 న జిల్లాలో సీఏం కేసీఆర్ పర్యటన
  • హరితహారం మొక్కలపై దృష్టిసారించిన కలెక్టర్​

నిజామాబాద్, వెలుగు:కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంలో కొత్తగా కట్టిన సమీకృత కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శనివారం ఆయన పరిశీలించారు. సెప్టెంబర్ 5న సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా సుందరీకరణ, లైటింగ్ పనులపై ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు. కలెక్టరేట్ పరిసరాలన్నీ పచ్చదనంతో ఉండాలన్నారు. ఆయన వెంట అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్, నిజామాబాద్ ఆర్డీవో రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. 

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించం

నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలను ఉపేక్షించవద్దని కలెక్టర్ నారాయణరెడ్డి మున్సిపల్, రెవెన్యూ శాఖల ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీఎస్ బీ పాస్ యాక్ట్, పట్టణ ప్రగతి, హరితహారం స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై కలెకర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీక్షించారు. టీఎస్ బీ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పక్కాగా అమలు చేయాలని సూచించారు. అక్రమ నిర్మాణాలపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ప్రతి మున్సిపాలిటీలో వచ్చే సోమవారం నాటికి కంప్లైంట్ బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.

రాబోయేది బీజేపీ ప్రభుత్వమే..

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు: టీఆర్ఎస్  అవినీతి పాలనతో ప్రజలు విరక్తి చెందారని, రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్యనారాయణ అన్నారు. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే బీజేపీ సభకు శనివారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ప్రజా పోరాటాలను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుట్రలు చేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో కావాలనే మత విద్వేషాలను రెచ్చగొడుతూ అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, ఇప్పకాయల కిశోర్, శ్రీనివాస్, గడ్డం రాజు, రవి, అమంద్​ విజయ్, ఆశిష్, భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

కామారెడ్డి నుంచి తరలిన లీడర్లు

బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సభ హన్మకొండకు శనివారం కామారెడ్డి జిల్లా నుంచి ఆ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.  కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల నుంచి 120  వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తరలి వెళ్లారు. 


ఒకే రోజు 59 ఆపరేషన్లు

నిజామాబాద్ టౌన్, వెలుగు: నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల్లోనే 59 సర్జరీలు నిర్వహించి కొత్త రికార్డు నెలకొల్పినట్లు  హాస్పిటల్‌‌ సూపరింటెండెంట్ డాక్టర్ పత్రిమారాజ్‌‌‌‌ తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఆరు విభాగాలు ఐదు ఆపరేషన్ థియేటర్లలో 59 సర్జరీలు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆప్పత్రుల్లో కార్పొరేట్‌‌‌‌ దీటుగా సేవలు అందుతున్నాయని చెప్పారు. నిజామాబాద్‌‌‌‌లో అన్ని రకాల అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ సందర్భంగా ఆప్పత్రి సూపరింటెండెంట్‌‌‌‌ ప్రతిమారాజ్‌‌‌‌ను మంత్రి అభినందించారు.

కిటకిటలాడిన ఆలయాలు

పిట్లం, వెలుగు: శ్రావణ మాసం చివరి శనివారం కావడంతో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పిట్లం మండలం చిన్నకొడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రామలింగేశ్వర గుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అమావాస్య సందర్భంగా జగదాంబ తండా హనుమాన్ ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. పిట్లంకు చెందిన దాత కుమ్మరి శివరత్నం అన్న ప్రసాదం పంపిణీ చేశారు. పిట్లం వెంకటేశ్వరాలయంలో ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అన్నదానం చేశారు. 

ఈసీ మీటింగ్ నిర్వహించాలి

డిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: టీయూ ఎక్జిక్యూ టివ్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని స్టూడెంట్ లీడర్లు డిమాండ్ చేశారు. శనివారం ఈ మేరకు టీయూ ఈసీ సభ్యులు రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, హారతికి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్సిటీ ఈసీ మీటింగ్ గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిందని గుర్తుచేశారు. రిజిస్ట్రార్​ నియామకం సహ పలు కీలక నిర్ణయాలకు ఈసీ అప్రూవల్ తప్పనిసరి కాగా వీసీ రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గుప్తా కావాలనే మీటింగ్ పెట్టడంలేదని ఆరోపించారు. కార్యక్రమంలో లీడర్లు సంతోష్, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాయితేజ, సాయికృష్ణ, నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శివసాయి పాల్గొన్నారు.

ఆరోగ్య సమస్యలపై అశ్రద్ధ వద్దు

మాక్లూర్, వెలుగు: ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వహించ వద్దని  ప్రముఖ గైనకాలజిస్ట్‌‌ అంకం భానుప్రియ  అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని  దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  తెలంగాణ సోషల్​ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో హెల్త్​అవేర్నెస్ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా మంది మహిళలకు రక్తహీనత సమస్య ఉంటుందని, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చన్నారు.  జంక్ ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా సొంత వైద్యం చేసుకోకుండా సంబంధిత  వైద్యులను కలవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.లావణ్య, వైస్ ప్రిన్సిపాల్ వాసవి లత, లయన్స్ క్లబ్ కార్యదర్శి జిల్కర్ విజయానంద్, కోశాధికారి చింతల గంగాదాస్, ప్రోగ్రామ్  చైర్మెన్ డాక్టర్ రాజశేఖర్, చింత రాజు పాల్గొన్నారు.

సిద్ధుల గుట్ట ఘాట్ రోడ్డుపై  సెంట్రల్ లైటింగ్

ఆర్మూర్, వెలుగు:  ప్రసిద్ధ నవనాథ సిద్ధుల గుట్టపై ఘాట్ రోడ్డు వెంట సెంట్రల్ లైటింగ్​ఏర్పాటు కోసం శనివారం మున్సిపల్​చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ పండిత్ వినీత పవన్ భూమిపూజ చేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్​ ఏనుగు శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తాము అడిగిన వెంటనే సెంట్రల్​ లైటింగ్​ఏర్పాటుకు రూ.40 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కుమార్ శర్మ, బి.సుమన్, బొబిడె కిషన్, కొడిగెల మల్లయ్య, తలారి చందు, నక్కల లక్ష్మణ్, ​నూతుల చిన్నారెడ్డి పాల్గొన్నారు.