నిజామాబాద్ జిల్లాలో నేషనల్ హైవే రోడ్ల భూసేకరణ పూర్తి : కలెక్టర్ వినయ్‌‌‌‌ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జిల్లాలో నేషనల్ హైవే రోడ్ల భూసేకరణ పూర్తి : కలెక్టర్ వినయ్‌‌‌‌ కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు :  జిల్లాలో నేషనల్ హైవే రోడ్ల నిర్మాణానికి కావాల్సిన 74 హెక్టార్ల భూసేకరణ పూర్తి అయిందని కలెక్టర్ వినయ్‌‌‌‌ కృష్ణారెడ్డి తెలిపారు. శనివారం స్టేట్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో కలెక్టర్‌‌‌‌ జిల్లా వివరాలు తెలిపారు. సేకరించిన భూసేకరణకు సంబంధించిన  అవార్డులు పాస్ అయ్యాయని, 19.3 హెక్టార్ల భూసేకరణ పై గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే తొలగించినందున మిగిలిన పనులను పూర్తి చేస్తామని తెలిపారు.

 రోడ్ల నిర్మాణానికి సేకరించిన భూమి హైవే అథారిటీస్ కు అప్పగించాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్​లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎఫ్​వీవో వికాస్ మీనా, బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్, ఆర్డీవీవో రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.