అధికార పార్టీని గెలిపిస్తేనే ప్రజలకు మేలు.. 19 డివిజన్ అభ్యర్థిని కాటిపల్లి శమంత

అధికార పార్టీని గెలిపిస్తేనే ప్రజలకు మేలు.. 19 డివిజన్ అభ్యర్థిని కాటిపల్లి శమంత

నిజామాబాద్​, వెలుగు:  స్టేట్​లో అధికారంలో ఉన్న కాంగ్రెస్​  జెండా నగర పాలక సంస్థలో గెలిస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయని  19 డివిజన్​ కాంగ్రెస్​ అభ్యర్థిని కాటిపల్లి శమంత అన్నారు. ఆదివారం ఆమె డివిజన్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. గవర్నమెంట్​ టీచర్​గా పనిచేసి 2024లో రిటైర్డ్​ అయిన తనకు సామాజిక స్పృహ అధికమన్నారు.

 ప్రజల కోరిక మేరకే ఎన్నికల్లో నిలబడ్డానని,  తనను గెలిపిస్తే నిజాయితీగా సేవలందిస్తానన్నారు. డ్రైనేజీ, తాగునీరు, వీధి రోడ్లు నిర్మించి లైట్ల సమస్య పరిష్కరిస్తానన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. బీజేపీ చేతగాని ప్రచారంపై స్పందించనని,  తనను గెలిపించి ఆ పార్టీకి బుద్ధిచెప్పాలని కోరారు. నుడా చైర్మన్​ కేశవేణు తదితరులు ఉన్నారు.