మీకు శాంతి కావాలో అశాంతి కావాలో తేల్చుకోండి

 మీకు శాంతి కావాలో అశాంతి కావాలో తేల్చుకోండి

బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఇరుపక్షాల ప్రతినిధులతో చర్చలు జరిపారు పోలీసులు. శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సమావేశంలో నిజామాబాద్ సీపీ నాగరాజు, అడిషనల్ డీసీపీ వినిత్, బోధన్ ఏసీపీ రామారావు పాల్గొన్నారు. బోధన్ లో శాంతి కమిటీ సమావేశం అనంతరం సి పి నాగరాజు మీడియాతో మాట్లాడారు. బోధన్ అంటే తనకు మంచి అభిప్రాయం వుందన్నారు. అన్ని వర్గాల వారు ఇ క్కడ కలసి వుంటారని తనకు తెలుసన్నారు. ఒకరిపైనొకరు రాళ్ళు వేసుకున్నారని ఆరోపించారు. 

మీపై కేసులు పెట్టాలని తమకు కక్ష లేదన్నారు. ఎమ్మెల్యే చెబితేనే కొందరిపై పై కేసులు పెట్టారని అనడం సరికాదన్నారు సీపీ.  నిన్నటి ఘటనతో సగటు చిరు వ్యాపారులు తమ ఉపాధిని కోల్పోయారన్నారు. అందరూ కలిసి మెలసి వుండటమే తమకు కావాలన్నారు సీపీ నాగరాజు. తప్పులు చేసిన వారిపై కచ్చితంగా రౌడీ షీటర్ కేసులు పెడతామని హెచ్చరించారు. మీకు శాంతి కావాలో అశాంతి కావాలో మీరే తెలుసుకోవాలన్నారు. బోధన్ లోని యువతకు  ఉపాధి అవకాశాల కొరకు ట్రైనింగ్ ఇప్పిస్తానన్నారు. ఒకరు పెట్టే ట్రప్ లో పడి యువత ఇలాంటి గొడవలకు పోకూడదని సీపీ హితవు పలికారు. ఇలాంటి గొడవల పై క్రిమినల్ కేసులు పెట్టాడానికి తాను వెనుకకు పోయే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 

ఇవి కూడా చదవండి:

ది కాశ్మీర్ ఫైల్స్ మూవీపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో అసంతృప్తి