ది కాశ్మీర్ ఫైల్స్ మూవీపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

ది కాశ్మీర్ ఫైల్స్  మూవీపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

తెలంగాణ ఉద్యమం చేసినట్లే రైతు ఉద్యమం చేయాలన్నారు సీఎం కేసీఆర్.  క్షేత్ర స్థాయిలో రైతులను కలుపుకొని ఉద్యమం చేయాలని సూచించారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం మొదటి విడత ముగిసింది. లంచ్ తర్వాత జరిగే సమావేశంలో  ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను తీసుకోనున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా  వడ్లకే కాదు ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. రాష్ట్రంలో 24, 25 తేదీల్లో ఆందోళనలు చేయాలన్నారు.  28న యాదాద్రి ప్రారంభోత్సవానికి అందరు రావాలన్నారు. ఇప్పటికే 30 నియోజకవర్గాల్లో సర్వే రిపోర్ట్ వచ్చిందన్నారు. 30 నియోజకవర్గాల్లో 29 టీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. నెలాఖరు వరకు అన్ని నియోజకవర్గాల సర్వేలు వస్తాయన్నారు. పార్లమెంట్ లో అంశాల వారీగా  సమస్యలపై ఉద్యమించాలన్నారు. వడ్ల కొనుగోలును ప్రధానంగా చేసుకుని కార్యాచరణ చేయాలన్నారు.

కాశ్మీర్ ఫైల్స్  మూవీపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సమస్యలను పక్కదారి పట్టించడానికే కాశ్మీర్ ఫైల్స్ సినిమాను తెరపైకి తెచ్చారన్నారు. కాశ్మీర్ లో హిందూ పండిట్స్ పై దాడులు జరిగినపుడు బీజేపీప్రభుత్వం అధికారంలో లేదా? అని ప్రశ్నించారు.