టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో అసంతృప్తి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో అసంతృప్తి

వందల మంది బలిదానాలతో 2014లో ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని గద్దెనెక్కిన కేసీఆర్ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఫలాలను ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే అనుభవిస్తోందన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన ప్రజలకు ఈ రోజుకీ న్యాయం జరగలేదని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో సామాన్య ప్రజలే కాదు.. అధికార పార్టీ నేతలు కూడా సంతోషంగా లేరని అన్నారు. రాష్ట్రంలో అంతా అసంతృప్తితోనే ఉన్నారన్నారు. వికారాబాద్ లో బీజేపీ పదాధికారుల సమావేశంలో తరుణ్ చుగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దుర్మార్గపు పాలనను అంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ పాలనను ప్రతి ఒక్కరూ అసంతృప్తితోనే ఉన్నారని తరుణ్ చుగ్ అన్నారు. మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారాలని దిక్కులు చూసే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన కేబినెట్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతోందని, ఆ కేబినెట్ పై కేసీఆర్ కిచెన్ కేబినెట్ పెత్తనం నడుస్తోందని తరుణ్ చుగ్ ఆరోపించారు. నిజమైన బంగారు తెలంగాణ సాకారమై, రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికీ, ప్రతి సామాన్యుడికీ న్యాయం జరగాలంటే అందరూ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కారును గద్దె దించి.. బీజేపీ అధికారంలోకి రాబోతోందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

నిన్నే గెలిపిస్తాం.. బొడిగె శోభకు మాటిచ్చిన రైతు

ఎంత ప్రేమో... తలపైనే గూడు కట్టాడు

ఉప ఎన్నికలో పోటీకి దిగిన బాలీవుడ్ నటుడు