ఎంత ప్రేమో... తలపైనే గూడు కట్టాడు

ఎంత ప్రేమో... తలపైనే గూడు కట్టాడు

పిచ్చుకలు... ఒకప్పుడు అవి కిచ కిచమని చేసే శబ్ధాలతో మనం నిద్రలేచేవాళ్లం. పొద్దున్న లేవగానే.. ఎదురుగా ఉన్న చెట్టుపైనో.. గోడపైనో పిచ్చుకలు కనిపించేవి. కానీ ఇప్పుడు  మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సిటీల్లో అయితే వాటి ఊసే లేదు. అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చుకోవాలనే తాపత్రయంలో ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేస్తున్న సెల్‌టవర్లు ఈ చిన్నారి నేస్తాలకు మరణ శాసనాన్ని రాస్తున్నాయి. అందుకే చాలామంది పక్షి ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు... పిచ్చుకల పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు. 

తాజాగా ఓ సామాజిక కార్యకర్త పిచ్చుకలపై ప్రేమతో ఏకంగా తన నెత్తినే గూడు చేశారు. సోషల్ వర్కర్ బ్రహ్మానంద ఆచార్య పిచ్చుకలు అంతరించిపోతున్నాయని ప్రజలను హెచ్చరించడానికి తన తలపై తాత్కాలిక గూడును ధరించారు. " 90% పైగా పిచ్చుకలు అంతరించిపోయాయి. మనం పెంపుడు పిచ్చుకలను చూసుకోకపోతే, త్వరలో అవి గతం అయిపోతాయి" అంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాడు.