ఉప ఎన్నికలో పోటీకి దిగిన బాలీవుడ్ నటుడు

ఉప ఎన్నికలో పోటీకి దిగిన బాలీవుడ్ నటుడు

మాజీ బీజేపీ నేత, బాలీవుడ్ ప్రముఖ నటుడు శతృఘ్న సిన్హా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తాజాగా ఆయన పశ్చిమ బెంగాల్ నుంచి పోటీ చేయనున్నారు. బెంగాల్‌లో జరగనున్న ఉప ఎన్నికలో సిన్హా పోటీ చేసేందుకు సిన్హా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో జరగనున్న ఉప ఎన్నికలకు టిఎంసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.  బెంగాల్‌లో అసన్ సోల్ లోక్ సభ స్ధానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఆయన్ను బరిలోకి దింపాలని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సిన్హాను బరిలోకి దించి బీజేపీకి గట్టి కౌంటర్ ఇవ్వాలని భావిస్తోంది.