నిన్నే గెలిపిస్తాం.. బొడిగె శోభకు మాటిచ్చిన రైతు

నిన్నే గెలిపిస్తాం.. బొడిగె శోభకు మాటిచ్చిన రైతు

చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బొడిగె శోభకు ఓ రైతన్న నుంచి అనూహ్య మద్దతు లభించింది. సోమవారం ఆమె రామడుగు మండలం దేశ్ రాజ్ పల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ రైతు వచ్చే ఎన్నికల్లో తమ ఓటును వంద శాతం మీకే వేసి గెలిపించుకుంటామని బొడిగె శోభకు మాటిచ్చాడు. ‘‘మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పనులు చేయించారు. కానీ మేం మిమ్మల్ని మరిచిపోం. ఇప్పుడు మా ఊరిలో డ్రైనేజీ వెడల్పు పనులు జరగాల్సి ఉంది. ఈ పనులు చేస్తలేరు. ఈ సారి మళ్లీ నూరు శాతం మిమ్మలే గెలిపిస్తాం’’ అని చెప్పాడు. గ్రామాల్లో మీటింగులు పెట్టుకుని అంతా ఒక్క మాట మీద ఓటు మీకే వేస్తామని ఆమెకు తెలిపాడు.

హుజురాబాద్ లో ఓటుకు పది వేలిచ్చి కొనుక్కున్నా.. ప్రజలు బీజేపీని గెలిపించారని ఆ రైతు గుర్తు చేశాడు. కేసీఆర్ అబద్ధాల ముఖ్యమంత్రి అని, చెప్పేవన్నీ మాయ మాటలేని అన్నాడు. ‘‘మా డబ్బులు మాకే ఇచ్చాడు. ఆ సొమ్ము కేసీఆర్ ఇంట్లోంచి తెచ్చింది కాదు’’ అని చెప్పాడు ఆ రైతు.

మరిన్ని వార్తల కోసం..

ది కాశ్మీర్ ఫైల్స్ మూవీపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

జూనియర్ ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిలిం తొలగింపు

ఆప్ అభ్యర్థిగా రాజ్యసభకు మాజీ క్రికెటర్ నామినేషన్