ఆప్ అభ్యర్థిగా రాజ్యసభకు మాజీ క్రికెటర్ నామినేషన్

ఆప్ అభ్యర్థిగా రాజ్యసభకు మాజీ క్రికెటర్ నామినేషన్

ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. రాజ్యసభకు టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ వెళ్లనున్నారు. దీంతో పంజాబ్ నుంచి ఆయన రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.  ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు ఎంపిక చేసిన నలుగురిలో క్రికెటర్ హర్భజన్ సింగ్ ఒకరు.. భజ్జీతో పాటుగా ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ పాఠక్ లను రాజ్యసభకి నామినేట్ చేస్తూ ఆప్ నిర్ణయం తీసుకుంది. తో వారిద్దరు కూడా ఇవాళ తమ నామినేషన్లను దాఖలు చేశారు. 

పంజాబ్‌లోని ఏడుగురు రాజ్యసభ సభ్యులలో ఐదుగురి పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. దీంతో మార్చి 31న ఆయా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరేళ్లు ఉండనున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

https://mobile.twitter.com/ANI/status/1505806568339959809