
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల ఫలితం దేశమంతటినీ ఆకర్శిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బోధన్ మినహా.. 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉదయం 10గంటల వరకు ఉన్న కౌంటింగ్ రిజల్ట్ ప్రకారం.. ప్రస్తుతం 25వేల ఆధిక్యంలో ఉన్నారు అరవింద్.
మరోవైపు.. టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎంపీ కవిత కౌంటింగ్ లో వెనుకంజలో ఉన్నారు. ఆమె లోక్ సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ లలో వెనుకబడి ఉన్నారు. బోధన్ లో ముందంజలో ఉన్నారు.
నిజామాబాద్ : లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తెలంగాణ నుంచి నిజామాబాద్ నియోజకవర్గంలో కల్వకుంట్ల కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 16వేల ఆధిక్యంలో ఉన్నారు.
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల ఫలితాల ఆరంభ ట్రెండ్స్ లో బీజేపీ లీడ్ లో కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు వచ్చిన ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ లీడ్ లో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కవిత వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ మూడోస్థానంలో కొనసాగుతున్నారు.