హిందూ సమాజాన్ని ఐక్యతను దెబ్బ తీసే కుట్ర: ఎంపీ అర్వింద్

హిందూ సమాజాన్ని ఐక్యతను దెబ్బ తీసే కుట్ర: ఎంపీ అర్వింద్

తిరుపతి లడ్డు వివాదంపై కేంద్రం సీరియస్ గా ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. లడ్డు మాత్రమే కాదు భక్తులు ఇబ్బందిపడ్డారన్నారు. సనాతన ధర్మ స్థాపన కోసం గతంలోనే బోర్డు  ఏర్పాటు కావాల్సిందన్నారు. హిందూ సమాజాన్ని ఐక్యతను దెబ్బ తీసే కుట్ర జరుగుతోంది.. తిరుపతి లడ్డూ కల్తీ పై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.

ALSO READ : Tirumala Laddu Row: మనకేం కావాలి.. పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్..

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. కష్టపడి పనిచేస్తే వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. బీఆర్ఎస్ కు కుక్క కూడా ఓటేయదన్నారు అర్వింద్.  హైడ్రా కూల్చివేతలు సెలెక్టివ్ గా  కాకుండా సెక్యులర్ గా ఉండాలన్నారు. కులం, మతం, ప్రాంతం వంటి బేధాలు చూడొద్దని అన్నారు. హైడ్రాను జిల్లాలకు విస్తరించాలన్నారు. వరి కోతలు మొదలు కాకముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.