
జగిత్యాల: బీజేపీ మెంబర్ షిప్ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు సభ్యత్వాలు అందించారు. ఆ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో అర్వింద్ మాట్లాడారు. ఓ మిత్రుడిగా కేటీఆర్ కు ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని అన్నారు అర్వింద్. ప్రజలకు వాస్తవాలు మాత్రమే చెప్పాలని అన్నారు. మీ నాయన కేసీఆర్ లాగా అబద్దాలు మాట్లాడడం ఆపాలని హితవు పలికారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు గెలవడం ప్రారంభమైందని చెప్పారు. KTR ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే అది కేవలం ఇప్పుడు మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఇక ఆ తర్వాత కేటీఆర్ కు జీవితంలో సీఎం అయ్యే అవకాశం రాదన్నారు అర్వింద్. బీజేపీలో చేరేవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.