మోదీ ట్రంప్కు భయపడుతున్నారు.. అందుకే ఏదో దాస్తున్నారు : రాహుల్ గాంధీ

మోదీ ట్రంప్కు భయపడుతున్నారు.. అందుకే ఏదో దాస్తున్నారు : రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భయపడుతున్నారని.. అందుకే ఏదో దాస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు విపక్ష నేత రాహుల్ గాంధీ. ఇండియా-పాక్ సీజ్ ఫైర్ విషయంలో ట్రంప్ పదే పదే కామెంట్స్ చేస్తున్నా మోదీ మాట్లాడలేక పోతున్నారని అన్నారు. ఈ విషయంలో ట్రంప్ అబద్ధం చెబుతున్నారని మోదీ చెప్పలేరని.. ఒకవేళ చెబితే ట్రంప్ అసలు నిజం బయట పెడతారని.. మోదీని ఎక్స్పోజ్ చేస్తారని అన్నారు.  ట్రంప్ ఒత్తిడిలో మోదీ ఉన్నారని.. అందుకే ఏదో దాస్తున్నారని తెలిపారు.

భారత్ తో ట్రంప్ డ్రేట్ డీల్ కోరుకుంటున్నారని అన్నారు రాహుల్ గాంధీ. అందుకే భారత్ పై ఒత్తిడి పెంచుతున్నారని చెప్పారు.  ట్రంప్ మాటలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పలేదన్నారు రాహుల్. మోదీ సమాధానం చెప్పనంత వరకు ట్రంప్ చెప్పిందే నిజమని భావిస్తామన్నారు.

మరోవైపు ఇండియాతో ట్రేడ్ డీల్ గురించి ట్రంప్ మరోసారి మాట్లాడారు.  విలేకరి అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ భారత్ తన మిత్రదేశమని.. ప్రధాని మోదీ తన స్నేహితుడని ట్రంప్ చెప్పారు. ఇప్పటి వరకు ట్రేడ్ డీల్ జరగలేదని బదులిచ్చిన ట్రంప్.. అన్ని దేశాలకంటే ఎక్కువ సుంకాలను భారత్ విధిస్తోందని చెప్పారు. అనేక సంవత్సరాలుగా ఇదే కొనసాగుతోందని.. ఇకపై ఇలా చేయటం న్యాయం కాదన్నారు ట్రంప్. అయితే ఆగస్టు 1న గడువు నాటికి డీల్ పూర్తి కాకుంటే ఇండియాపై కూడా 20 నుంచి 25 శాతం వరకు టారిఫ్స్ విధించనున్నట్లు స్పష్టం చేశారు.