
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి దిక్సూచిగా మారారంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. చేసిన కామెంట్స్ ను తిప్పికొట్టారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. హర్ ఘర్ జల్ అనే స్కీమ్ తెలంగాణ మిషన్ భగీరథ నుంచి కాపీ కొట్టిందే అంటూ కేటీఆర్ చెప్పడాన్ని ఎంపీ అర్వింద్ తప్పుపట్టారు. గుజరాత్ లో వాటర్ గ్రిడ్ ను తెలంగాణలో కాపీ కొట్టారని అన్నారు.
“‘రైతు బంధు’, ‘మిషన్ భగీరథ’ లను చూసి కేంద్రం కాపీ కొడుతుందని సెలవిచ్చారు కల్వకుంట్ల తారక రామారావు గారు. 2014లో గుజరాత్ వాటర్ గ్రిడ్ ప్రాజక్టుని అధ్యయనం చేయడానికి వెళ్లిన KTRని కింది చిత్రాల్లో చూడవచ్చు. అంటే ఎవరు ఎవరికీ కాపీ కొట్టారో అర్ధం అయితనే ఉంది. పోతే గుజరాత్ లో చేపట్టిన వాటర్ గ్రిడ్ లో రూపాయి అవినీతి జరగలేదు. మరి మన రాష్ట్రంలో ఎంత అవినీతి జరుగుతుందో ఆ ‘అయోధ్య రాముడికెరుక, ఈ తారక రాముడికెరుక’ !!
ఈ దేశానికి దిక్సూచి KCR అట?!!!? మరి ప్రపంచానికే దిక్సూచి అయిన నరేంద్రమోడీ గారికి మీ పథకాలను కాపీ కొట్టాల్సిన ఖర్మ పట్టిందంటారా??” అని ధర్మపురి అరవింద్ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.