ఎమ్మెల్సీ కవితవి అహంకారపు మాటలు: ఎంపీ అర్వింద్​

ఎమ్మెల్సీ కవితవి అహంకారపు మాటలు: ఎంపీ అర్వింద్​

నిజామాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్​​ కేసులో మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడంపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ స్పందించారు. ‘కవిత లాంటివాళ్లు సమాజానికి చెదపురుగుల లాంటివాళ్లు. రాష్ట్ర పురోగతికి ప్రధాన అడ్డంకి. వీళ్ల కుటుంబం చేసిన అవినీతి వల్ల తెలంగాణ రాష్ట్రం రెండు దశాబ్దాల పాటు వెనుకకు వెళ్లిపోయింది. 

ఎంత తొందరగా నేరారోపణ రుజువై దోషిగా తేలితే.. చట్టం వీళ్లని రాజకీయాల నుంచి బయటికి తరిమేస్తే సమాజానికి అంత  మేలవుతుంది. ఈమె చేసిన చెడు పనులకు ఈడీ నోటీసులు పంపిస్తే,  వాటిని మోదీ నోటీసులుగా వర్ణించడం కళ్లు నెత్తికెక్కి మాట్లాడిన అహంకారపు పరాకాష్ట మాటలకు నిలువెత్తు నిదర్శనం’ అర్వింద్​ట్విట్టర్​లో పేర్కొన్నారు.