
టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ కు తప్ప ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఎవరికి లేదన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. నిన్న గులాబీ డ్రామాకి తెరపడిందన్నారు. కేసీఆర్ పై ప్రజలకు, ఆ పార్టీ నాయకలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు విరక్తి పుట్టిందన్నారు. ఎమ్మెల్యేలపై అనుచితంగా, ఆ మర్యాదగా మాట్లాడటం రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేలపై గవర్నర్ కి లేఖ రాస్తానన్నారు. ఎన్టీఆర్ లాంటి మహనాయకుడికే ఓటమి తప్పలేదని.. కేసీఆర్ ఎంతా? అని అన్నారు. 2023 వరకు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలని..ఆయన్ని గద్దె దించి తాము అధికారంలోకి వస్తామన్నారు. కేటీఆర్ మాట్లాడిస్తే ఎమ్మెల్యేలు మాట్లాడారని.. మూడు నెలల నుంచి కళ్ళు ముసుకున్నవా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ కు ఓటమి తప్పదన్నారు అర్వింద్.
SEE MORE NEWS