ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అన్ని జిల్లాలకు కొత్త ఉద్యోగాలు

ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అన్ని జిల్లాలకు కొత్త ఉద్యోగాలు

కేసీఆర్,కేటీఆర్ లకు ఈటల భయం పట్టుకుందన్నారు నిజమాబాద్ ఎంపీ అర్వింద్. ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే ఉద్యోగాల భర్తీ, జల వివాదాలు తెరపైకి తెచ్చారన్నారు. థర్డ్ వేవ్ హెచ్చరికలున్నా... ఔట్ సోర్సింగ్ నర్సులను  తొలగించడం కరెక్ట్ కాదన్నారు. ఉప ఎన్నికలు వస్తేనే తెలంగాణలో ఉద్యోగాల ప్రకటనలు వస్తున్నాయన్నారు.  ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అన్ని జిల్లాలకు కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉన్న ఉద్యోగాలు పీకేసి కొత్త ఉద్యోగాలు ఇస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారన్నారు.
 

రాష్ట్రంలో ఖర్చు చేసే ప్రతీ పైసా కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు అర్వింద్. నిజామాబాద్ లో మాట్లాడిన అరవింద్.. మహిళ అధికారిపై మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలను ఖండించారు.  కోవిడ్ సమయం లో హెల్త్ మినిష్టర్ తో పాటు హెల్త్ వర్కర్లను కూడా తొలగించిన ఘనత కేసీఆర్ దే నన్నారు.  ఉద్యమ కారులను నిర్లక్ష్యం చేయడం బంగారు తెలంగాణనా అని ప్రశ్నించారు. కేంద్రం కరోనా  వ్యాక్సిన్ ఇస్తున్నా ప్రజలకు అందించడంలో తెలంగాణ సర్కారు విఫలమైందన్నారు. వాస్తు కోసమే వాసాల మర్రిని దత్తత తీసుకున్నారు. ప్రజలు అడ్డుకుంటారనే  సీఎం తన  పర్యటనకు పోలీసులను మోహరిస్తున్నారు.దళితులను మభ్య పెట్టేందుకు 10 లక్షల ప్రకటన చేశారన్నారు.