మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరవకుంటే ఉద్యమిస్తాం

మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరవకుంటే ఉద్యమిస్తాం

తన తండ్రి, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ ను బీజేపీలోకి ఆహ్వానిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. 2023 ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణతో సిద్ధమవుతున్నామని, తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, కష్టపడి పనిచేస్తూ టీఆర్ఎస్ పై పోరాడే వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని అర్వింద్ చెప్పారు.

సంక్రాంతి తర్వాత ఉద్యమిస్తాం

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి వరిపంట, ధాన్యంపై అవగాహన లేదని, మంత్రి సొంత జిల్లాలో ఆయన అనుచరులే సన్ ఫ్లవర్ విత్తనాలను బ్లాక్ లో విక్రయిస్తున్నారని ఆరోపించారు అర్వింద్. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ సర్కారు కేంద్రానికి రాసిచ్చిందని, అయినా అదనంగా కొనుగోలు చేశామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో చెరుకు పంటకు పూర్వ వైభవం తెస్తామని ధర్మపురి అర్వింద్ చెప్పారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలని, సర్కారు ఆ పని చేయకుంటే సంక్రాంతి తర్వాత ఉద్యమిస్తామని హెచ్చరించారు.  నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు డిపాజిట్లు, అప్పుల వివరాలను ఛైర్మన్ ప్రజల ముందు ఉంచాలని, లేదంటే  బాన్సువాడ నుంచి ఉద్యమం లెవదీస్తామని చెప్పారు. వచ్చే సీజన్ లో పసుపు పంటకు మద్దతు ధర ఇప్పిస్తామని అన్నారు.