
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో గురువారం పార్టీ ఆఫీస్ ను ఆయన ప్రారంభించారు. అనతరం ఎంపీ మాట్లాడుతూ.. పార్టీ లీడర్లు, కార్యకర్తలు నెలరోజులు సైనికుల్లా కష్టపడి రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పైడి రాకేశ్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అయోధ్యలో ప్రతిష్టించనున్న బాల రాముడు విగ్రహానికి ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రత్యేక పూజలు చేశారు. భార్గవ పిక్చర్స్, అయోధ్య డెవలప్ మెంట్సంయుక్తంగా అయోధ్యలో బాల రాముడు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు పురోహితులు సత్యకాశీ భార్గవ తెలిపారు. బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్, కంచెట్టి గంగాధర్, ఆలూర్ విజయ భారతి, జెస్సు అనిల్, యామాద్రి భాస్కర్ పాల్గొన్నారు.