మతాల పేరుతో బీజేపీ లీడర్లు చిచ్చు పెడుతున్నరు : రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

మతాల పేరుతో బీజేపీ లీడర్లు చిచ్చు పెడుతున్నరు : రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నిజామాబాద్​ రూరల్, వెలుగు: బీజేపీ   నాయకులు మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవడం తప్పా ప్రజల కోసం చేసిందేమీ లేదని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఆదివారం 3,4,5 డివిజన్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ..  ఎంపీ అర్వింద్​ ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వచ్చి రాముడు, కృష్ణుడు అంటూ.. హిందూముస్లిమంటు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాడని మిగితా సమయంలో ప్రజల వైపు కన్నెత్తి కూడా చూడడని అన్నారు.

అర్వింద్​ గడిచిన ఏడు సంవత్సరాల్లో గ్రామాల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదని, ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నడో చెప్పాలని ప్రశ్నించారు.  ఈ ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్​ ముప్పగంగారెడ్డి, బాగారెడ్డి, అభ్యర్థులు జక్కులసంధ్య, తరుణ్​, రమేశ్​రెడ్డి పలువురు కాంగ్రెస్​ నాయకులు ఁపాల్గొన్నారు.