జీడిమెట్ల, వెలుగు: నిజాంపేట్లో విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. బాచుపల్లి మండల పరిధిలోని నిజాంపేట్విలేజ్సర్వే నంబర్191లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని విలువ సుమారు రూ.750 కోట్లు కాగా, కొందరు వ్యక్తులు ఈ భూమిలో కబ్జాకు యత్నించారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయగా, క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. శాశ్వత నివాసాలను వదిలేసి 10 ఎకరాల్లో ఉన్న షెడ్డు, ప్రహరీ గోడలను గురువారం తొలగించారు. అనంతరం ప్రభుత్వ స్థలం చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు.

