నవీన్ మిట్టల్‭తో చర్చలకు సిద్ధమైన నిజాం విద్యార్థినులు

నవీన్ మిట్టల్‭తో చర్చలకు సిద్ధమైన నిజాం విద్యార్థినులు

నిజాం కాలేజీ విద్యార్థులు ఎట్టకేలకు శాంతించారు. వైస్ ప్రిన్సిపాల్ అభ్యర్థన మేరకు ఉన్నత విద్యా కళాశాలల కమిషనర్ నవీన్ మిట్టల్‭తో చర్చలకు విద్యార్థినులు ముందుకు వచ్చారు. అందరి తరపున తమ సమస్యలు ఆయన గురించి వివరించేందుకు 10 మంది విద్యార్థినులు నవీన్ మిట్టల్ తో భేటీ కానున్నారు. మరికాసేపట్లో నిజాం కాలేజీ నుంచి నాంపల్లిలోని నవీన్ మిట్టల్ కార్యాలయానికి వారు వెళ్లనున్నారు. 

మరోవైపు కొందరు విద్యార్థినులు కళాశాల ప్రాంగణంలోనే ఆందోళనను కొనసాగిస్తున్నారు. డిగ్రీ విద్యార్థులకు హాస్టల్‌ బిల్డింగ్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు హాస్టల్ కేటాయించే వరకు పోరాటం కొనసాగుతుందని విద్యార్థినులు స్పష్టం చేశారు. కొత్త హాస్టల్ బిల్డింగ్ ను పీజీ విద్యార్థులకు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.