నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులకు జలశోభ

నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులకు జలశోభ

భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా..ప్రస్తుతం 1395.59 అడుగులకు నీరు చేరింది.  నిజాంసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 7.284 టీఎంసీల వరకు నీరు చేరింది. ప్రాజెక్టులోకి 9420 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఎడతెరిపి లేని వానలు..ఎగువ నుంచి వస్తున్న వరదలతో నాగిరెడ్డిపేట్ మండలం పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1464 అడుగులు అవగా..ప్రస్తుతం 1464 అడుగుల వరకు నీరుంది. దీంతో ప్రాజెక్టు పై నుంచి నీరు మంజీరానదిలోకి వెళ్తోంది. దాదాపు  13,736 క్యూసెక్కుల నీరు మంజీరా నదిలోకి వెళ్తుందని అధికారులు తెలిపారు.