Spy first glimps: నిఖిల్ స్పై టీజర్ వచ్చేసింది.. నేతాజీ మరణం వెనుక ఉన్న అసలు రహస్యం

Spy first glimps: నిఖిల్ స్పై టీజర్ వచ్చేసింది.. నేతాజీ మరణం వెనుక ఉన్న అసలు రహస్యం

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పై టీజర్ రిలీజ్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఉండే కర్తవ్యపథ్ వద్ద ఈ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇక టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఈ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం చుట్టూ ఉన్న మిస్టరీ స్టోరీ గురించి చెప్పనున్నారు.

నిజానికి సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయాడనేది ఒక కవర్ స్టోరీ అని, అసలు నిజం ఏంటో ఈ సినిమాతో చెబుతున్నాం అంటున్నాడు నిఖిల్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో ఓ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. ఈ ఒక్క టీజర్ సినిమాపై అంచనాలు భారీగానే పెంచేసింది. అలాగే కార్తికేయ2 తరువాత నిఖిల్ నుండి వస్తున్న సినిమా కావడం మరో ప్లస్ పాయింట్.

ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను.. క్షణం, గూఢచారి, ఎవరు, హిట్-1,2 వంటి సస్పెన్స్ సినిమాలకు ఎడిటర్ గా పని చేసిన ‘గర్రి బిహెచ్’ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీచరణ్ పకల సంగీతం అందిస్తున్న ఈ మూవీని.. ఈడి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.