తెలంగాణ రాష్ట్రంలోని 90%  మెడికల్ కాలేజీలకు ఎన్‌‌‌‌ఎంసీ నోటీసులు

తెలంగాణ రాష్ట్రంలోని 90%  మెడికల్ కాలేజీలకు ఎన్‌‌‌‌ఎంసీ నోటీసులు
  • వైద్య సేవల్లో, నిర్వహణలో వైఫల్యంపై ఎన్ఎంసీ ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) షాక్ ఇచ్చింది. దాదాపు 20 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు, మెజార్టీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్‌‌‌‌కు మెయిల్స్ పంపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తవి కలిపి జిల్లాకు ఒక్కటి చొప్పున 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా, 28 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి.

వీటిలో ఏకంగా 90 శాతం కాలేజీలకు నోటీసులు జారీ కావడం గమనార్హం. మెడికల్ కాలేజీల్లో మెయింటెనెన్స్ సరిగా లేదంటూ ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్‌‌‌‌కు పంపిన మెయిల్‌‌‌‌లో ఎన్ఎంసీ పేర్కొంది. ఇతర అనేక సమస్యలను నోటీసుల్లో  ప్రస్తావించింది. వీటిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.