
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అపోలో సెంట్రల్ హాస్పిటల్(ఎన్ఎండీసీ) వార్డ్ అటెండెంట్, స్టాఫ్ నర్సు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 29 నుంచి జూన్ 1 వరకు నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బీఎస్సీ, పదోతరగతి, జీఎన్ఎం, డీఎంఎల్టీ, బీఎంఎల్టీ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు తేదీలు
స్టాఫ్ నర్స్ మే 29, అసిస్టెంట్ డైటీషియన్, అసిస్టెంట్ అప్టోమెరిటిస్ట్, డ్రెస్సర్ మే 30, ఓటీ టెక్నీషియన్, అసిస్టెంట్ ఫార్మాసిస్ట్, అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్, అసిస్టెంట్ రేడియోగ్రాఫర్(సీటీ టెక్నీషియన్), అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్, అసిస్టెంట్ రేడియోగ్రాఫర్(సీటీ టెక్నీషియన్) మే 31, వార్డ్ అటెండెంట్ జూన్ 01.