ఎన్‌‌‌‌‌‌‌‌ఎండీసీ స్టీల్‌‌‌‌‌‌‌‌ ప్రైవేటైజేషన్​కు బిడ్స్​ 

ఎన్‌‌‌‌‌‌‌‌ఎండీసీ స్టీల్‌‌‌‌‌‌‌‌ ప్రైవేటైజేషన్​కు బిడ్స్​ 

న్యూఢిల్లీ: ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్ స్టీల్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో బ్లాస్ట్ ఫర్నేస్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన తర్వాత ఎన్‌‌‌‌‌‌‌‌ఎండీసీ స్టీల్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌) ను ప్రైవేటీకరించడానికి ఫైనాన్షియల్​ బిడ్‌‌‌‌‌‌‌‌లను కేంద్రం ఆహ్వానించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.  ఫర్నేస్ మొదలైతే కంపెనీ విలువ పెరుగుతుందని  భావిస్తున్నారు. ఎన్​ఎస్​ఎల్​కు​ సంవత్సరానికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది.

భారతదేశంలో అత్యధికంగా ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే ఎన్​ఎండీసీ నుంచి విడిపోయిన తర్వాత ఎన్ఎస్ఎల్​లో ప్రభుత్వానికి 60.79 శాతం వాటా వచ్చింది. మిగిలిన 39.21 శాతం వాటాను ఐపీఓ ద్వారా అమ్మారు. నిర్వహణ నియంత్రణతో పాటు తన వాటాలో 50.79 శాతాన్ని అమ్మాలని కేంద్రం చూస్తోంది.