క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో 50శాతం మందికి ద‌క్క‌ని కొలువులు..అయోమ‌యంలో విద్యార్ధులు

క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో 50శాతం మందికి ద‌క్క‌ని కొలువులు..అయోమ‌యంలో విద్యార్ధులు

రాష్ట్రంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్లకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ పెద్దగా రావడం లేదు. ఏటా పాసవుతున్న వారిలో కనీసం 50 శాతం మందికి కూడా కొలువులు దక్కడం లేదు. నాలుగైదు ఏండ్లుగా ప్లేస్ మెంట్స్ సంఖ్య పెరగడం లేదు. ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ పొందిన వారిలోనూ అపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆర్డర్స్ కొంతమందికే అందుతున్నాయి. యూజీ, పీజీ స్టూడెంట్లతో పోలిస్తే డిప్లొమా స్టూడెంట్లకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈసారి కరోనా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇప్పటికీ యూజీ, పీజీ ఎగ్జామ్స్ జరగలేదు. ఉన్న ఉద్యోగులనే సంస్థలు తగ్గిస్తున్నాయి. ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ పొందిన స్టూడెంట్లు.. ఉద్యోగాలు ఉంటాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.

59,418 మంది సెలెక్ట్

రాష్ట్రంలో 2019–20 అకడమిక్ ఇయర్ కు సంబంధించి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా కోర్సుల ఫైనల్ సెమిసర్ట్ ఎగ్జామ్స్ ఇంకా జరగలేదు. కానీ పోయినేడాది జులై నుంచి డిసెంబర్ వరకు వివిధ కాలేజీల్లో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 59,418 మంది స్టూడెంట్లు సెలెక్ట్ అయ్యారు. వీరిలో బీటెక్, ఫార్మసీతో పాటు టెక్నికల్ యూజీ కోర్సుల స్టూడెంట్లు 37,346 మంది.. ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర పీజీ కోర్సుల స్టూడెంట్లు 17,771 మంది.. డిప్లొమా స్టూడెంట్స్ 4,301 మంది ఉన్నారు. 2018–19లో టెక్నికల్ కోర్సుల స్టూడెంట్లు 1,21,303 మంది పాస్ కాగా, 59,289 మందికి ప్లేస్‌‌మెంట్స్ వచ్చాయి. వీరిలో యూజీ స్టూడెంట్స్ 36,929 మంది, పీజీ స్టూడెంట్స్ 17,598 మంది, డిప్లొమా స్టూడెంట్స్ 4,762 మంది ఉన్నారు.

ప్రైవేటులో బెటర్ కానీ..

క్యాంపస్ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌లో సర్కారు కంటే ప్రైవేటులో చదివే వారికే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. 2019–20లో ప్రైవేట్ స్టూడెంట్లు 55,133 మంది ప్లేస్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో సెలెక్ట్ కాగా, సర్కార్ స్టూడెంట్లు 4,285 మంది మాత్రమే ఎంపికయ్యారు. 2018–19లో ప్రైవేటు ఇనిస్టిట్యూట్స్ లో 1,07,724 మంది పాస్ అయితే 55,100 (51శాతం) మందికి, సర్కారు కాలేజీల్లో 13,579 మంది పాసైతే 4,179 (30శాతం) మందికి ప్లేస్ మెంట్స్ లభించాయి. కొన్ని కాలేజీలు చిన్న సంస్థలతో క్యాంపస్‌‌లు పెడుతుండగా, మరికొన్ని ప్లేస్‌‌మెంట్స్ లేకుండానే ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. దీనిపై ఎంక్వైరీ చేసే మెకానిజం యూనివర్సిటీల్లో లేకపోవడంతో మేనేజ్మెంట్లు చెప్పిందే నమ్మాల్సి వస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.