మేడ్చల్ మున్సిపాలిటీ ఛైర్పర్సన్పై అవిశ్వాసం

మేడ్చల్ మున్సిపాలిటీ ఛైర్పర్సన్పై అవిశ్వాసం

మేడ్చల్ : రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మేయర్లు, చైర్ పర్సన్లపై సొంతపార్టీకి చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లే తిరుగుబాటు జెండా ఎగురేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొన్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై సొంతపార్టీ కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టారు. తాజాగా మేడ్చల్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ మర్రి దీపికపై కౌన్సిలర్లు తిరుగుబాటుబావుటా ఎగరేశారు. అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసి మేడ్చల్ కలెక్టరేట్ ఇన్ వర్డ్ లో అందజేశారు. ఎంతో నమ్మకంతో ఛైర్ పర్సన్గా ఎన్నుకుంటే ఆమె అవినీతికి పాల్పడుతోందని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అవిశ్వాసం విషయంలో మంత్రి మల్లారెడ్డి జోక్యం చేసుకొని చర్చలు జరిపినా వెనక్కి తగ్గకపోవడం విశేషం.