
కంది, వెలుగు : సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ సోమవారం వైస్ చైర్ పర్సన్ లత ఆధ్వర్యంలో 24 మంది కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని అభివృద్ధిని కుంటుపరిచిందని ఆరోపించారు. అవిశ్వస తీర్మానం ఇచ్చిన వారిలో కౌన్సిలర్లు శ్రీకాంత్, విష్ణు, విజయలక్ష్మి, మనీలా, స్వప్న, అంజుమ్, లావణ్య, రామప్ప, సమీ, పవన్ నాయక్, మంజుల, మానెమ్మ ఉన్నారు.